
అక్కినేని నాగార్జున నటించిన “మన్మథుడు” చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నాగ్ కెరీర్‌లో ఓ మైలురాయి. ముఖ్యంగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ప్రేయసిగా కనిపించి, తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి అన్షు అంబానీ. తొలి చిత్రంతోనే కుర్రకారు హృదయాలను దోచేసిన ఈ భామ, ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకుంది.
ఆ తర్వాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన “రాఘవేంద్ర” చిత్రంలో నటించి మరోసారి ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత అన్షు అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ, పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోయింది. దాదాపు 20 సంవత్సరాల విరామం తర్వాత, ఇప్పుడు ఆమె తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ అడుగుపెట్టింది.
అన్షు తన రీ-ఎంట్రీని “మజాకా” చిత్రంతో చేశింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా కథ పరంగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో అన్నది వేరే విషయం.
ప్రస్తుతం అన్షు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. ఇటీవల తన తాజా ఫోటోలను షేర్ చేయగా, వీటిపై అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. “వయసు పెరిగినా అందం మాత్రం తగ్గలేదు” అంటూ నెటిజన్లు ఆమె లుక్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.