Upasana Hosts Parents’ 40th Anniversary Celebration
Upasana Hosts Parents’ 40th Anniversary Celebration

మెగా కోడలు ఉపాసన తన తల్లిదండ్రులు అనిల్-శోభన 40వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు, ముఖ్యంగా ఉపాసన భర్త, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వేడుకలో క్లింకారా కూడా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం, డాన్స్, అనిల్-శోభన దంపతులు రింగ్స్ మార్చుకోవడం వంటి సరదా వేడుకలతో ఈ ఫంక్షన్ మరింత ప్రత్యేకంగా మారింది.

రామ్ చరణ్ తన అత్తామామలకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారితో కలిసి ఆనందంగా వేడుకను ఎంజాయ్ చేశాడు. ఉపాసన ఈ ప్రత్యేక క్షణాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. “40వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మ-నాన్న, మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాపై ఉంటుంది,” అంటూ తల్లిదండ్రులపై తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ వీడియోలో రామ్ చరణ్ పూర్తి హెయిర్, గడ్డంతో కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. దీనిని చూసిన మెగా ఫ్యాన్స్ చెర్రీ లుక్‌కు ఫిదా అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలో క్లింకారా కూడా కనిపించింది, అయితే ఎప్పట్లాగే ఆమె ముఖాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.

సినిమాల విషయానికి వస్తే, గేమ్ ఛేంజర్ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో, రామ్ చరణ్ తన తర్వాతి చిత్రంపై పూర్తిగా ఫోకస్ చేశాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మున్నాభాయ్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి, మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!

By admin