
వాల్తేరు వీరయ్య ఘన విజయం తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమా చేసి భారీ నిరాశను మిగిల్చాడు. అసలు ఈ సినిమా ఎందుకు చేశాడనే ప్రశ్న మెగా ఫ్యాన్స్‌ను కుదిపేసింది. ఆ షాక్ నుంచి బయటపడటానికే అభిమానులకు కొంత సమయం పట్టింది. ప్రస్తుతం చిరంజీవి నుంచి భారీ అంచనాలు ఉన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాతో బింబిసార ఫేమ్ వశిష్ట మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
అయితే విశ్వంభర టీజర్ విడుదలైన తర్వాత, కొన్ని విజువల్స్‌కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో, మేకర్స్ వెంటనే మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు కానీ, తర్వాత ఏమీ అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా మే 9న రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతున్నా, అది కూడా ఇంకా డౌట్ గానే ఉంది.
దీని ప్రధాన కారణం VFX పనులు ఇంకా పూర్తి కాకపోవడం. ఈ సినిమా పూర్తిగా విజువల్ వండర్‌గా ఉండాలనుకుంటున్న మేకర్స్, కచ్చితమైన ఔట్‌పుట్ కోసం మరికొంత టైం తీసుకుంటున్నారు. దీంతో అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతుంది.
ఇప్పటి పరిస్థితి చూస్తే విశ్వంభర ఆగస్టులో విడుదల అయ్యే అవకాశాలే ఎక్కువ. కానీ మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడం, అభిమానులను నిరాశ పరుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఆశిస్తూ ఉన్నారు.