
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాగానే పాతవాళ్లు పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితీ అలాగే ఉంది. తెలుగు సినిమాలు లేకపోవడంతో తమిళ సినిమాలపై దృష్టిపెట్టింది.
అలాగే స్పెషల్ సాంగ్స్ ద్వారా తన కెరీర్ కొనసాగించేందుకు కొత్త దారి వెతుకుతోంది. 2018లో రంగస్థలం సినిమాలో “జిగేల్ రాణి” పాటతో ఆకట్టుకున్న పూజా, ఆ తర్వాత F3 లోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న “కూలీ” లో ఓ ప్రత్యేక పాటలో నటిస్తోంది. తమన్నా పాత్రలా ఉండబోతోందని సమాచారం.
ఇటీవలే “కూలీ” సెట్స్‌లో జాయిన్ అయ్యిన పూజా, మరోవైపు సూర్యతో “రెట్రో”, విజయ్‌తో “జననాయకన్” సినిమాల్లో నటిస్తోంది. తెలుగు సినిమాలు లేకపోయినా తమిళ, హిందీ పరిశ్రమల్లో అవకాశాలు అందుకుంటోంది.
తన కెరీర్‌ను ఫోటోషూట్లు, బ్రాండ్ ప్రమోషన్లతో బిజీగా కొనసాగిస్తున్న పూజా, మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో బిగ్ సినిమా ద్వారా రాబోతోందని టాక్.