
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీ షెడ్యూల్ కొనసాగిస్తున్నాడు. సలార్, కల్కి 2898 AD వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్, ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్‌టైనర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయనుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి రేకెత్తించాయి.
రాజా సాబ్ తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి డైరెక్షన్ లో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. సలార్ 2, కల్కి 2 లు కూడా ప్రభాస్ లైనప్‌లో ఉండగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు వెల్లడిస్తూ, “ప్రభాస్‌ను ఫోన్ చేసి అడిగిన వెంటనే అతను వెంటనే ఒప్పుకున్నారు. అయితే మొదటగా నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేయడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడు” అంటూ చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయనున్నాడు.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ ఉండగా, కన్నప్ప టీజర్ మార్చి 1న విడుదల కానుంది. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.