Struggling Actresses in Tollywood Industry
Struggling Actresses in Tollywood Industry

టాలీవుడ్‌లో పలు హీరోయిన్లు మంచి లుక్, టాలెంట్ ఉన్నప్పటికీ కెరీర్‌లో సరైన బ్రేక్ దొరకలేదు. Rashii Khanna, Shalini Pandey, Nabha Natesh, Krithi Shetty లాంటి బ్యూటీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారు. రాశి ఖన్నా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించినా, పెద్ద హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాతో భారీగా వెలుగులోకి వచ్చిన Shalini Pandey, ఆ తర్వాత మరే సినిమా తోనూ ఆకట్టుకోలేకపోయింది. ఒక్క సినిమాతోనే తన కెరీర్ నిలిచిపోయింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నా, అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.

Nabha Natesh, నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, వరుసగా అవకాశాలు వచ్చినా సరైన కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం Nikhi’s Swayambhu మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ, కెరీర్ రూట్ మార్చుకునేందుకు గ్లామర్ డోస్ పెంచుతోంది. కానీ ఛాన్సులేమీ పెద్దగా పడడం లేదు.

హ్యాట్రిక్ బ్యూటీ Krithi Shetty కూడా ఇదే పరిస్థితిలో ఉంది. Sharwanand’s Manamey సినిమా ఫ్లాప్ అవ్వడంతో, ఆమెకు కొత్త ఆఫర్లు రావడం మందకొడిగా మారింది. అవకాశాలు తగ్గిపోవడంతో గ్లామర్ షో పెంచినా, దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. మరి ఈ అందాల భామలకు టాలీవుడ్‌లో అదృష్టం ఎప్పుడు వరించనుందో చూడాలి!

By admin