
బాలీవుడ్ అందమైన జంట కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని, అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు. “మా జీవితంలోకి ఒక అద్భుతమైన బహుమతి రాబోతోంది” అంటూ సోషల్ మీడియాలో బేబీ ఎమోజీతో అనౌన్స్ చేశారు.
ఈ వార్తతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు వారిని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. 2023లో వైవాహిక జీవితం ప్రారంభించిన కియారా – సిద్ధార్థ్, ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ తమ సినిమా కెరీర్‌లో విజయవంతంగా కొనసాగుతూనే, వ్యక్తిగత జీవితాన్ని కూడా సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. ఈ జంట త్వరలో తల్లిదండ్రులుగా మారబోతుండటంతో, వారి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
కియారా తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో పంచుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ అభిమానులు తాము ఎప్పుడెప్పుడు బేబీ ఫొటోలు చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అద్వానీ మాతృత్వం, సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రిగా మారడం వారి జీవితంలో మరో గొప్ప మైలురాయి అవుతుందని అందరూ భావిస్తున్నారు.