
టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మేనన్ వరుస హిట్లతో దూసుకుపోతోంది. భీమ్లా నాయక్ తో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ, ఆ తర్వాత బింబిసార, విరూపాక్ష లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. విరూపాక్ష సినిమా అయితే 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది.
ఈ భామ నటించిన సార్ (Vaathi) కూడా ధనుష్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచింది. కాగా, ఇటీవల కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ మాత్రం యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. అయినా 100% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం స్వయంభు, అఖండ 2, నారీ నారీ నడుము మురారి, బీఎస్ఎస్ 12 లాంటి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది.
బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న సంయుక్త, మహారాణి: ది క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే మలయాళం బిగ్ బడ్జెట్ మూవీ రామ్ లో మోహన్ లాల్ సరసన నటిస్తోంది. ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలోనే స్టార్డమ్ అందుకున్న నటి కావడంతో, సంయుక్తపై భారీ అంచనాలున్నాయి.
ఇంతకాలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ఈ భామ, ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో రాణించేందుకు రెడీ అవుతోంది. సంయుక్త కెరీర్ మళ్లీ కొత్త హైట్స్‌కి వెళ్లబోతుందా? చూడాలి.