
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్‌గా ఆయన ఎంపికయ్యారని టాక్ వస్తోంది. బిగ్ బాస్ తెలుగు షో మొదటి నుండి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నప్పటికీ, గత సీజన్‌లో ఆయనపై నెగిటివ్ కామెంట్స్ పెరిగాయి. దీంతో షో మేకర్స్ కొత్త హోస్ట్ కోసం వెతికారని తెలుస్తోంది.
బాలయ్య – మొదటి ఎంపిక కానీ…
అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ హోస్టింగ్ స్కిల్స్ అందరికీ తెలిసిపోయాయి. అందుకే, బిగ్ బాస్ 9 కోసం అతనిని సంప్రదించారని, కానీ బాలయ్య నో చెప్పాడని సమాచారం. ఆ తర్వాతే ఈ ఆఫర్ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
రౌడీ హీరో రెడీ!
విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్టింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారీ రెమ్యునరేషన్‌తో పాటు, ఈ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు విజయ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ 9 – కొత్త ఫార్మాట్?
ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేశారని, కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే లీక్ అవుతోందంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అసలు నిజం తెలియాలంటే బిగ్ బాస్ 9 అధికారిక ప్రోమో కోసం వేచి చూడాలి.
బిగ్ బాస్ 9లో నాగార్జున ఉంటాడా?
నాగార్జున పూర్తిగా తప్పుకున్నారా? లేక కొత్త హోస్ట్‌తో పాటు కొన్ని ఎపిసోడ్స్‌లో అతను కనిపిస్తాడా? అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ టాక్ నిజమో కాదో తెలియదు.