Mad Square Movie Press Meet Highlights
Mad Square Movie Press Meet Highlights

కామెడీ లవర్స్‌కు గుడ్ న్యూస్! బ్లాక్‌బస్టర్ హిట్ ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మరింత వినోదంతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. కేవలం కొన్ని గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ దాటి, అంచనాలను మరింత పెంచేసింది.

ఈ సినిమా పాటలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “మీరు మ్యాడ్ ని ఎంత ప్రేమించారో తెలిసిన విషయమే. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే పది రెట్లు ఎంటర్టైనింగ్. ప్రతి సీన్ నవ్విస్తూనే ఉంటుంది. మార్చి 29న సినిమా విడుదలవుతుంది, తప్పక చూడండి” అన్నారు.

నటుడు సంగీత్ శోభన్ కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ, “టీజర్‌లో చూసింది చిన్న స్నీక్ పీక్ మాత్రమే! అసలు సినిమా అందరి ఊహకు మించి వుంటుంది. మ్యాడ్ టైం లో నిర్మాత వంశీ గారు ‘సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాం’ అన్న మాట గుర్తుందా? ఇప్పుడు అదే మాట నేనూ చెప్తున్నా… నచ్చకపోతే డబుల్ డబ్బులు ఇస్తాం (నవ్వుతూ)” అంటూ హాస్యంగా చెప్పారు.

By admin