
మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ, ఒకరిపై ఒకరు కేసులు వేయడం, బౌన్సర్లతో బెదిరింపులు వంటి విషయాలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఇక విష్ణు మనోజ్ ఇంటి జనరేటర్లో పంచదార పోశాడు అనే ఆరోపణను విష్ణు హాస్యప్రాయంగా కొట్టిపారేశారు.
ఇక ప్రొఫెషనల్ గా చూస్తే, మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” మూవీతో బిజీగా ఉన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన సాంగ్ సినిమా పై భారీ అంచనాలు పెంచింది.
తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన విష్ణు, కన్నప్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు “అవును” అని సమాధానం ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్‌ను గెస్ట్‌గా పిలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు “ఖచ్చితంగా ఆయన్ను అడుగుతాం” అని తెలిపారు.
ఇక జనరేటర్లో షుగర్ వేయడంపై ఓ నెటిజన్ “నిజంగానే షుగర్ వేశావా?” అని ప్రశ్నించగా, “ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని చదివా” అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా ఎలా మలుపు తీసుకుంటుందో చూడాలి!