
మాళవిక మోహనన్ అందాల నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2013లో “పట్టం పోల్” సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది.
ఈ బ్యూటీ తమిళ పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలు చేసింది. స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు “రాజాసాబ్” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటి నుంచే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల, మాళవిక రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. నడుము అందం, నాభి అందాన్ని చూపిస్తూ ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన మాళవిక, తన గ్లామరస్ లుక్స్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది.
రాజాసాబ్ మూవీతో మాళవిక మోహనన్ టాలీవుడ్‌లో సత్తా చూపుతుందా? అనేది చూడాల్సిన విషయం. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మరో మలుపు తీసుకురావొచ్చు. ఈ బ్యూటీ మరిన్ని తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుందా? అనే ఆసక్తికర ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది.