Mirnaa Menon Stunning Black Skirt
Mirnaa Menon Stunning Black Skirt

మిర్నా మీనన్ మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2016లో “పట్టతారి” అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన నటనా ప్రతిభను చూపించి మంచి మార్కులు కొట్టేసింది.

2022లో “క్రేజీ ఫెలో” సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ ఈ చిత్రం ఆమెకు పెద్దగా హైప్ తేలేకపోయింది. అయితే “జైలర్” సినిమాలో తలైవా కోడలిగా నటించి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు సడెన్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అల్లరి నరేష్ “ఉగ్రం” సినిమాలో కూడా నటించి తన వెర్సటైల్ యాక్టింగ్ తో మెప్పించింది.

ఇటీవల, మిర్నా బ్లాక్ స్కర్ట్ లో ఇచ్చిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటకంగా చూసే లుక్స్, స్టన్నింగ్ బ్యూటీ తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. మిర్నా తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది.

ప్రస్తుతం, టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గినా, తన గ్లామర్, ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ తో మిర్నా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ బ్యూటీ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తుందో తెలియాల్సి ఉంది, కానీ ఆమె తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

By admin