
టాలీవుడ్ లో కొత్త తరం హీరోయిన్స్ లో కావ్య థాపర్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటోంది. మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ “ఈ మాయ పేరేమిటో” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆమెకు అసలైన గుర్తింపు OTT హిట్ “ఏక్ మినీ కథ” ద్వారా వచ్చింది.
ఈ సినిమా తరువాత, కావ్య వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. “బిచ్చగాడు 2,” “ఈగల్,” “ఊరు పేరు భైరవకోన,” వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం “డబుల్ ఇస్మార్ట్”, “విశ్వం” చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాల విజయ, అపజయాలను పట్టించుకోకుండా, ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోటోలు, స్టైలిష్ వీడియోలు పోస్ట్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది. ప్రత్యేకించి, ఇటీవల షేర్ చేసిన ఫోటోలు యువతలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
వరుస సినిమాలతో టాలీవుడ్ లో తన స్థానం పెంచుకుంటున్న కావ్య థాపర్, త్వరలో మరిన్ని ప్రముఖ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు సిద్ధమవుతోంది.