How Raveena Tandon Ruled Bollywood
How Raveena Tandon Ruled Bollywood

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో చెప్పలేం. కొంతమంది కష్టపడినా బ్రేక్ రాక పోవచ్చు, మరికొందరు తొలి సినిమా తోనే సూపర్ స్టార్ గా మారతారు. కానీ అంతటి ఫేమ్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఒకే ఏడాదిలో 8 బ్లాక్ బస్టర్స్ అందించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా? ఆమె పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ కలిగిన సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్. ప్రస్తుతం ఆమె వయసు 52 ఏళ్లైనా, ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

1991లో “పథర్ కె ఫూల్” సినిమాతో బాలీవుడ్ లోకి వచ్చిన రవీనా, మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. కానీ 1994లోనే ఆమె సినీ కెరీర్ టాప్ గేర్ లోకి వెళ్లింది. “మోహ్రా” సినిమాలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, నసీరుద్దీన్ షా వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ ఏడాదిలో ఆమె 8 హిట్ సినిమాలు అందించి బాలీవుడ్ ను ఏలింది.

1995లో షారుఖ్ ఖాన్ సరసన “జమానా దివానా” సినిమాలో నటించింది. అసలుగా యష్ చోప్రా “డర్” సినిమాలో రవీనాను తీసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె కాస్ట్యూమ్ పట్ల అసంతృప్తిగా ఉండటంతో జూహి చావ్లా ఆ పాత్రను పోషించింది. అయినా, రవీనా కెరీర్ అదిరిపోయేలా కొనసాగింది.

₹166 కోట్ల నెట్ వర్త్ కలిగిన రవీనా, 2004లో నిర్మాత అనిల్ తడానిని వివాహం చేసుకుంది. ప్రశాంత్ నీల్, యష్ కాంబోలో వచ్చిన “కేజీఎఫ్ 2” లో కూడా నటించి తన మునుపటి గ్లోరీ ను రీగైన్ చేసుకుంది. సీనియర్ హీరోయిన్ అయినా, ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు.

By admin