
తెలుగు సినిమా ప్రేమికుల హృదయాల్లో “ఖడ్గం” ఎప్పటికీ ప్రత్యేక స్థానం దక్కించుకున్న చిత్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీవీల్లో చూడటమే ఆనవాయితీ. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించగా, సోనాలి బింద్రే, సంగీత హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు. కిమ్ శర్మ ప్రత్యేక పాత్రలో కనిపించి, “ముసుగు వెయ్యొద్దు మనసు మీద” పాటతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ పాటతో ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు లభించినప్పటికీ, సినీ అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
“ఖడ్గం” తర్వాత, కిమ్ శర్మ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. చాలా ఏళ్ల విరామం తర్వాత, రామ్ చరణ్ “మగధీర” లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. బాలీవుడ్‌లో అవకాశాలు వెతికిన ఆమె, అక్కడ స్పెషల్ నంబర్లు, క్యామియో రోల్స్ లో కనిపించారు. బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణా తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినా, కొంత కాలానికే బ్రేకప్ అయ్యారని సమాచారం.
ప్రస్తుతం కిమ్ శర్మ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. 44 ఏళ్ల వయసులో కూడా, ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ఫిట్‌నెస్, స్టైల్, గ్లామర్ లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ కనిపిస్తున్నారు.
కిమ్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఫాలోయింగ్ పెరుగుతుండటంతో, మరల సినిమాల్లో అవకాశాలు వస్తాయా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
