
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ చేసిన ఆరోపణలకు ఫన్నీగా స్పందించారు. గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఓ ఘటనలో విష్ణు తన ఇంటి జనరేటర్‌లో పంచదార పోశాడని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై విష్ణు స్పందించకపోయినప్పటికీ, తాజాగా ఓ సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప భారీ అంచనాలతో రూపొందుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన విష్ణు, ఇటీవల ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ జరిపి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
ఒకవైపు మంచు ఫ్యామిలీ వివాదం హీటెక్కుతుండగా, మరోవైపు కన్నప్ప మూవీ హైప్ పెరుగుతూ ఉంది. స్టార్ కాస్ట్, గ్రాండ్ విజువల్స్, పవర్‌ఫుల్ స్టోరీ తో కన్నప్ప సంవత్సరంలోని బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.