
హీరోయిన్ల ఫోటోలపై అభిమానులు చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్ వరకు అన్నింటినీ భద్రంగా దాచుకోవడమే కాదు, వాటిని తమ ఖాతాల్లో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఒక హీరోయిన్ బాల్యం నాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ చిన్నారిని గుర్తుపట్టడం అంత ఈజీ కాదు!
ఫోటోలో రెండు జడలతో, పెద్ద కళ్లజోడుతో అమాయకంగా నవ్వుతూ కనిపించే ఈ చిన్నారి మరెవరో కాదు – అంజలి! తెలుగమ్మాయి అయినప్పటికీ, తమిళ పరిశ్రమలో ‘షాపింగ్ మాల్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘జర్నీ’ సినిమా హిట్ అవడంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేశ్ సరసన నటించి భారీ క్రేజ్ సంపాదించుకుంది.
అంజలి కెరీర్‌లో కొన్ని హిట్స్ తర్వాత భారీ విజయాలు లేకపోయినా, ‘సింగం 2’, ‘సరైనోడు’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో మెప్పించింది. ప్రస్తుతం ఆమె తమిళ, తెలుగు సినిమాలతో పాటు ఓటీటీ వైపు కూడా అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కూడా నటించింది, కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పటికీ అంజలి అందం, అభినయం అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ వైరల్ చిన్ననాటి ఫోటో మరోసారి ఆమె మీద ఆసక్తిని పెంచింది.