‘మట్కా’ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కి డేట్ ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూర్తి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ చిత్ర టీమ్ దసరా కానుకగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను రివీల్ చేశారు. ‘మట్కా’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘లే లే రాజా’ అనే పెప్పీ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తనదైన స్టెప్పులతో కుర్రకారును అలరించనుంది. ఈ పాటను అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

The post ‘మట్కా’ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కి డేట్ ఫిక్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *