హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరి నిశ్చితార్థం వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఘట్టం పై క్లారిటీ వచ్చింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్ 4, 2024న పెళ్లి జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు, ఇది అధికారికంగా ధృవీకరించబడింది, గెస్ట్‌లకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్ ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా ఈ వేడుకను ఎటువంటి గ్రాండ్ సెలబ్రేషన్లు లేకుండా నిర్వహిస్తారని.. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులతో పాటు సన్నిహితులు, అతికొద్ది మంది మిత్రులు మాత్రమే హాజరు అవుతారని తెలుస్తోంది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
The post ‘చైతు -శోభితా’ వెడ్డింగ్ డేట్ పై క్లారిటీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.