హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal agarwal) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సత్యభామ (Satyabhama) ఓటీటీలో జోరు చూపిస్తోంది. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో (prim video) ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అతి తక్కువ టైమ్ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకున్న సత్యభామ సినిమా ఇండియా వైడ్ గా టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. థియేటర్స్ కంటే ఎక్కువ సంఖ్యలో ఆడియెన్స్ కు ప్రైమ్ వీడియో ద్వారా సత్యభామ రీచ్ అయ్యింది.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర (Naveen chandra), ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది సత్యభామ. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కాజల్ అగర్వాల్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సత్యభామ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashikiran tikka) సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల (Suman chikkala) రూపొందించారు.