
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా మరోసారి ట్రెండ్ సృష్టిస్తున్నారు. కేవలం మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్స్‌కు పోటీగా నిలిచి, సొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. మాస్, యాక్షన్, రొమాన్స్, రా ఎమోషన్స్ కలిపి సినిమాలను తెరకెక్కించే ఆయనకు యూత్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన వంగా, యానిమల్ తో రణబీర్ కపూర్ కెరీర్ ను రీడిఫైన్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి, త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. అయితే, ఈ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుండగానే, సందీప్ వంగా చేసిన ఓ సెన్సేషనల్ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనను “పాటలు లేకుండా సినిమా తీయగలారా, హీరో లేకుండా తీయగలారా?” అని అడిగారు. దీనికి ఆయన “హీరో లేకుండా సినిమా తీయాలని నా మైండ్‌లో ఉంది” అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. “ఒకవేళ అలాంటి సినిమా తీస్తే, నా సినిమాలను విమర్శించిన వారికీ అది కూడా నచ్చదు. అయితే ఖచ్చితంగా నాలుగైదు సంవత్సరాల్లో హీరో లేకుండా సినిమా తీస్తా” అని ధీమాగా చెప్పారు.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సందీప్ వంగా అంటే చేస్తే చూపిస్తాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ మూవీ కోసం అట్టహాసంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, ఆయన హీరో లేకుండా సినిమా తీయబోతున్నారంటే కలెక్షన్ల సునామీ ఖాయం అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా మరోసారి సినిమా ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అయ్యారని చెప్పొచ్చు!