
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన మేనరిజం, నటనతో “డ్రాగన్” సినిమాతో హిట్ కొట్టాడు. ఈ మూవీకి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా, AGS సంస్థ నిర్మించింది. చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. సినిమా లవ్, రొమాన్స్, యాక్షన్ మేళవింపుగా సాగి యూత్‌ను బాగా ఆకట్టుకుంది.
థియేటర్స్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఫిబ్రవరి 21, 2025న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ రిలీజ్‌పై ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, డ్రాగన్ మూవీ మార్చి 21, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో స్నేహ, ఇవానా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించగా, దర్శకుడు అశ్వత్ మరిముత్తు కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ రంగనాథన్‌కు ఇది కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం కావడం విశేషం. సినిమాలోని పాటలు, రొమాంటిక్ సీన్లు, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పించాయి.
ఈ హిట్ తర్వాత ప్రదీప్ “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” అనే సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా, నయనతార రౌడీ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది, త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడికానుంది.