
బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌటెలా తన అందంతో ప్రేక్షకులను మాయ చేసుకుంటోంది. బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్‌లో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి, ఆ పాటకు భారీ స్పందన వచ్చింది. దబిడి దిబిడే పాట యువతను ఆకట్టుకుంది.
ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ జోష్‌లో ఉంది. సినిమాలతో పాటు తన అందమైన ఫోటోషూట్‌లు, సోషల్ మీడియా పోస్టులతో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలు షేర్ చేసింది. బ్రౌన్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్ లో కనిపించిన ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోల్లో ఊర్వశి గ్లామరస్ లుక్‌లో పాట పాడుతున్నట్లు కనిపించింది. ఫ్యాన్స్ ఆమె స్టన్నింగ్ లుక్స్‌కి ఫిదా అవుతూ కామెంట్స్ విసురుతున్నారు. “అద్భుతం”, “బ్యూటిఫుల్” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఊర్వశి ఎప్పుడూ ముందుంటుంది.
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఊర్వశి క్రేజ్ పెరుగుతోంది. వరుసగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ స్టార్ ఐటమ్ గర్ల్‌గా మారింది. త్వరలో ఊర్వశి మరో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది