సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి నిహారిక ఎన్ఎం (Niharika NM) బాగా పరిచయమే. ఆమె చేసే ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. సోషల్ ఇష్యూస్ తో తనదైన స్టైల్ లో ఈ వీడియోస్ చేస్తుంటుంది నిహారిక. ఇప్పుడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ హీరోయిన్ గా మారబోతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విశెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ (Geetha arts) సంస్థ. నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. సరికొత్తగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ను ఆకట్టుకుంటుంది. క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్ (Comedy queen) గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్స్ కు నిహారిక గట్టి పోటీ ఇవ్వనుంది.