రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebalstar prabhas) కల్కి సినిమా (Kalki 2898AD) సక్సెస్ ఫుల్ గా ‌ ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. మొదటి వారంలో (First week) ఈ సినిమా 725 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. వెయ్యికోట్ల రూపాయల ఫీట్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది కల్కి. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ బాగుండటంతో సినిమా సులువుగా వెయ్యి కోట్ల మార్క్ దాటుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

ఓవర్సీస్, బాలీవుడ్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కికి సాలిడ్ కలెక్షన్స్ దక్కుతున్నాయి. మొదటి వారం చూస్తే సగటున రోజుకు వంద కోట్ల రూపాయలకు పైగానే బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కాయి. వైజయంతీ మూవీస్ (Vyjayanthi movies) లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag ashwin) రూపొందించిన ఈ సినిమా కలెక్షన్స్ ధాటికి పలు చిత్రాల ఓల్డ్ రికార్డ్స్ కనుమరుగు అవుతున్నాయి.