29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఏఆర్ రెహమాన్ దంపతుల ఫుల్‌స్టాప్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 19, 2024 10:59 PM IST

ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఆయన చేయబోయే సినిమాలు ఏమిటి.. ఏ హీరోకు ఆయన సంగీతం ఇవ్వబోతున్నారంటూ అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తుంటారు. కానీ, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది.

ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పబోతున్నాడు. ఆయన తన సతీమణి సైరా భానుతో విడిపోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారు ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను బలపరుస్తూ సైరా భాను తరఫు న్యాయవాధి ఈ మేరకు అఫీషియల్ స్టేట్మెంట్ కూడా చేశారు. 1995లో సైరా భానుని పెళ్లాడిన ఏఆర్ రెహమాన్‌కి ముగ్గురు పిల్లలు. అయితే, ఇంత సుదీర్ఘమైన వారి అనుబంధం ఇప్పుడు విడిపోతుండటంతో రెహమాన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వీరు విడిపోవడానికి గల కారణాలు ఏమిటనేవి తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *