ఎట్టకేలకు డబుల్ ఇస్మార్ట్ (Double ismart) షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి బాలీవుడ్ నుంచి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కోసం పూరి చూసీ చూసీ సొంతంగానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. ఆయన లైగర్ (Liger) సినిమా ఎఫెక్ట్ తో కరణ్ జోహార్ (karan johar) లాంటి మిత్రులు కూడా పూరికి హ్యాండ్ ఇచ్చారు. సంజయ్ దత్ (Sanjay dutt) ఉన్నా డబుల్ ఇస్మార్ట్ లో వారెవరూ ఇన్వెస్ట్ చేయలేదు.

ఏమైనా పూరి డబుల్ ఇస్మార్ట్ కు గుమ్మడికాయ కొట్టేశాడు. టాకీ ఇంతకుముందే ఫినిష్ చేయగా రీసెంట్ గా రెండు సాంగ్స్ హైదరాబాద్ లో పిక్చరైజ్ చేశారు. దీంతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసి ఆగస్టు 15న రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా (pan india) స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛార్మి, పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ (Kavya thapar) హీరోయిన్ గా నటిస్తోంది.