మోహన్ భగత్ (Mohan bhagat), సుప్రిత సత్యనారాయణ్ (Supritha), భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ (Ravindra vijay) కీలక పాత్రల్లో నటించిన “ఆరంభం” (aarambham) సినిమా మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ప్రైమ్ వీడియో (Amazon prime video)లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. మే 10న థియేటర్స్ లోకి వచ్చిందీ సినిమా. టెక్నికల్ గా హై క్వాలిటీ మూవీగా ప్రశంసలు అందుకుంది ఆరంభం.

ఈ చిత్రాన్ని ఒక సెక్షన్ మూవీ లవర్స్ ఇష్టపడ్డారు. ఈటీవీ విన్ లో మంచి రెస్పాన్స్ రాగా..ఇప్పుడు ప్రైమ్ లోనూ ఆదరణ దక్కుతుందని టీమ్ ఆశిస్తున్నారు. ఆరంభం సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీని ఇప్పుడు ప్రైమ్ లో మరింత మంది ఆడియెన్స్ చూసే అవకాశం ఉంది.