దక్షిణాది సినీ ప్రియులకు నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఆ తర్వాత సహయ పాత్రలు పోషించడం మొదలు పెట్టాడు. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో ఎన్నో పాత్రలలో కనిపించి మెప్పించారు. కానీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు దగ్గరయ్యారు. శంఖం, మిర్చి, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించారు. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతయ్యగా నటిస్తూ అడియన్స్ కు చేరువయ్యారు. కానీ ఇప్పటికీ ఆయనను జనాలు కట్టప్పగానే గుర్తు పెట్టుకున్నారు. అంతగా ఆ పాత్రతో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సత్యరాజ్ కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సత్యరాజ్.. మీడియాకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి ఎవరికి అంతగా తెలియదు. సత్యరాజ్ భార్య పేరు మహేశ్వరి. ఆయనకు కూతురు దివ్య సత్యరాజ్, కోడుకు సిబిరాజ్. కూతురు న్యూట్రిషియన్‌గా కెరీర్‌ కొనసాగిస్తుండగా.. కొడుకు మాత్రం సినిమాల్లో రాణిస్తున్నాడు. సిబి సత్యరాజ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిని సిబిరాజ్ అని కూడా పిలుస్తారు. చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన సిబిరాజ్.. ఆ తర్వాత తండ్రి బాటలోనే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

2003లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభఇంచాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత జోర్, మన్నిన్ మైందన్, వెట్రివేల్ శక్తివేల్, కోవై బ్రదర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. తమిళ్ సినీ పరిశ్రమలో హీరోయిజం చిత్రాలు కాకుండా వైవిధ్యమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేవతిని 2008లో వివాహం చేసుకున్నాడు సిబిరాజ్. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం సిబిరాజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.