వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న హీరో కల్యాణ్ రామ్ (Kalyanram) కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా బింబిసార (Bimbisara). దర్శకుడు వశిష్ట (vassista) రూపొందించిన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత రిలీజై మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ హీరోయిన్ సంయుక్త (Samyuktha)కు టాలీవుడ్ లో బ్రైట్ కెరీర్ మొదలయ్యేలా చేసింది. టైమ్ ట్రావెల్ తో వందల ఏళ్ల నుంచి కలియుగానికి వచ్చిన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడి కథను ఆకట్టుకునేలా ఈ సినిమాలో చూపించారు.

ఇప్పుడీ చిత్రానికి ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు కల్యాణ్ రామ్. ఆయన నటించే 22వ చిత్రంగా బింబిసార 2 తెరకెక్కనుంది. బింబిసారుడికి ముందు త్రిగర్తల రాజ్యాన్ని ఏలిన రాజు కథను బింబిసార 2లో చూపించబోతున్నారు. రొమాంటిక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ పాదూరి (Anil paduri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది బింబిసార2. అతి త్వరలో సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.