Published on Nov 22, 2024 9:33 AM IST
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – ది బిగినింగ్” తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు సినిమా నుంచి ‘తొలి తొలి ముద్దు’ సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. ‘మా మూవీలోని ‘‘తొలి తొలి ముద్దు’’ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన వీరశంకర్ గారికి థ్యాంక్స్. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ తో ఉంటుంది. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ రూపొందించాలని అనుకున్నాం. భార్య భర్తల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాటలో సెట్ వర్క్ ఆకర్షణగా నిలుస్తుంది. 3 రోజులు ఈ పాట చిత్రీకరించాం. మేము అనుకున్నట్లే బాగా వచ్చింది. మా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నాం. డిసెంబ్ 15వ తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం. తొలి తొలి ముద్దు సాంగ్ రీల్స్, షార్ట్ చేసి మాకు పంపిస్తే ది బెస్ట్ అనిపించిన వాటికి ఫస్ట్ ప్రైజ్ కింద లక్ష రూపాయలు, సెకండ్ ప్రైజ్ గా యాభై వేలు, థర్డ్ ప్రైజ్ గా పాతిక వేలు బహుమతిగా అందిస్తాం’ అని అన్నారు.
గెస్ట్‌గా వచ్చిన దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ.. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు సుమన్ బాబు తన శక్తిమేరకు కృషిచేస్తున్నారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి. మనమంతా వీరికి సపోర్ట్ చేయాలి. రెండేళ్లుగా ఈ సినిమా కోసం సుమన్ బాబు కష్టపడుతున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఎర్రచీర ట్రెండ్ అవుతోంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్, హారర్ ..ఇవన్నీ ఒక కథలో కలిపి చేయడం అరుదైన ప్రయత్నం. ఇది ఇంతే ఫ్రెష్ గా డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రావాలి. ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా.. అని అన్నారు.
సంగీత దర్శకుడు ప్రమోద్ మాట్లాడుతూ.. సుమన్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ప్రమోద్… ముద్దు పదం హైలైట్ చేస్తూ రొమాంటిక్ సాంగ్ చేయాలని నన్ను అడిగారు. మేమంతా పాట ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుని రూపకల్పన చేశాం. హీరో హీరోయిన్స్ పాటలో బాగా పర్ ఫార్మ్ చేశారు. ఈ సాంగ్ మూవీకి ఒక హైలైట్ గా నిలుస్తుంది… అని అన్నారు.
హీరోయిన్ కారుణ్య చౌదరి మట్లాడుతూ.. ‘తొలి తొలి ముద్దు పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా మూవీలో ఈ సాంగ్ ఆకర్షణగా నిలుస్తుంది. ప్రమోద్ గారు పాటను బాగా కంపోజ్ చేశారు. “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. డిసెంబర్ 20న మా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.