వెంకీ మామ నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో మల్లీశ్వరి ఒక ప్రత్యేకమైనది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కత్రినా కైఫ్, ఇప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది.
వెంకీ మామ నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో మల్లీశ్వరి ఒక ప్రత్యేకమైనది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కత్రినా కైఫ్, ఇప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది.
ఇటీవల బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా కైఫ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట నుంచి ఎంతో ఆనందదాయకమైన వార్త బయటకు వచ్చింది.
తాను గర్భవతినని, తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామని కత్రినా కైఫ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేస్తూ తెలిపింది. అందులో ఆమె తన తాం బేబీ బంప్‌ను చూపిస్తూ హ్యాపీ మూమెంట్‌ను పంచుకుంది.
ఈ సంతోషకర వార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు, సహచర నటీనటులు ఆమె జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక ఇప్పటికే ఈ ఏడాది విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా సెన్సేషనల్ హిట్ సాధించి, అతనికి మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా కూడా జీవితంలో మరో మెట్టెక్కిన ఈ జంటకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ భారీగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి.