
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ భారీ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన కెరీర్‌లో మర్చిపోలేని హిట్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మళ్లీ రీ-రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌తో వచ్చిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది.
థియేటర్‌లో లేడీ ఫ్యాన్ డాన్స్ వీడియో వైరల్!
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. థియేటర్‌లో ఓ లేడీ ప్రేక్షకురాలు మహేష్ బాబు సాంగ్‌కు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై “ఇదే మహేష్ బాబు క్రేజ్!” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా ఆయన లుక్‌పై కూడా అభిమానుల్లో భారీ చర్చ నడుస్తోంది.
‘సీతమ్మ వాకిట్లో’ రీ-రిలీజ్ హిట్ అవ్వడంతో, మహేష్ బాబు నెక్ట్స్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.