
కొత్త టాలెంట్‌కి మంచి గుర్తింపు ఇచ్చే టాలీవుడ్ ఇప్పుడు మరో నూతన హీరోయిన్ కోసం ఎదురు చూస్తోంది. తమిళంలో ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్ పేరు మారుమోగిపోతోంది. ఈ సినిమా హిట్ కావడంతో, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమె క్రేజ్ పెరిగిపోయింది.
ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన హీరోయిన్. అయితే, సెకండ్ హీరోయిన్గా కయాదు లోహర్ ఆకట్టుకుని, ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు టాలీవుడ్లో విశ్వక్ సేన్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.
హీరోలపై కయాదు కామెంట్స్ వైరల్!
ఇటీవల, ఓ కళాశాల ఈవెంట్లో అభిమానులు కయాదుని ఫేవరెట్ హీరో ఎవరు? అని అడిగారు. ఆమె “విజయ్ సర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ‘తేరి’ సినిమా నా ఫేవరెట్” అని చెప్పింది. కానీ గతంలో, ధనుష్ తన ఫేవరెట్ తమిళ హీరో అని చెప్పిన వీడియో బయటకొచ్చింది. దీంతో, విజయ్, ధనుష్ ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలైంది!
ఇక కయాదు లోహర్ తెలుగులో కొత్త ప్రాజెక్టులు సైన్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. మరిన్ని అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి!