
సినీ ఇండస్ట్రీలో విడాకుల, బ్రేకప్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ప్రేమలో ఉన్న వాళ్లు బ్రేకప్ అంటున్నారు, పెళ్లైన వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన ప్రియుడితో విడిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమన్నా గత కొన్ని నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో సీక్రెట్‌గా ఉన్న ఈ రిలేషన్, తర్వాత ఓపెన్ అయింది. వీరిద్దరూ కలిసి ఈవెంట్స్‌కి హాజరయ్యారు, మీడియాకు ఫోటోస్ ఇచ్చారు. అయితే, గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, అందుకే తమన్నా, విజయ్ వేరుగా కనిపిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ బ్రేకప్ రూమర్స్ పై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. ప్రేమలో ఉన్నపుడు ఎప్పుడూ కలిసే కనిపించిన తమన్నా, విజయ్, ఇప్పుడు ఒంటరిగా బయటికి రావడం ఈ వార్తలను నిజం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ముంబై మీడియా కూడా ఇద్దరి బ్రేకప్ కన్ఫర్మ్ అయిపోయిందని ప్రచారం చేస్తోంది.
ప్రస్తుతం తమన్నా కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఆమె ఓదెల 2 షూటింగ్‌తో బిజీగా ఉంది. అలాగే హిందీలోనూ వరుస సినిమాలు సైన్ చేస్తోంది. మరి, ఈ బ్రేకప్ ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందా? లేదా పూర్తిగా వృత్తిపరంగా ముందుకు సాగిపోతుందా? అనేది చూడాలి!