
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచి, ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మత్స్యకారుల జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
తండేల్ చిత్రానికి గీతా ఆర్ట్స్ నిర్మాణం అందించగా, దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన పాటలు చార్ట్‌బస్టర్ గా మారాయి. ఈ సినిమాలో నాగ చైతన్య – తండేల్ రాజు, సాయి పల్లవి – బుజ్జితల్లి పాత్రల్లో నటించారు. కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
తండేల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix సొంతం చేసుకుంది. ఈ చిత్రం మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తండేల్ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.