Mumaith Khan’s Best Item Songs
Mumaith Khan’s Best Item Songs

ఐటెం నంబర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఓ వెలుగు వెలిగిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒడియా సహా ఎన్నో భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి అలరించింది. “పోకిరి”లో “ఇప్పటికింకా నా వయసు” పాటతో తెగ పాపులర్ అయింది. “మగధీర”, “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే”, “బుజ్జిగాడు”, “సీమశాస్త్రి”, “యోగి” వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్ చేసింది.

ఆ సమయంలోనే ఒక్కో పాటకు ₹50 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేంత క్రేజ్ తెచ్చుకుంది. అయితే, టాప్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ చేయడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయినా “ఆపరేషన్ దుర్యోధన”, “మైసమ్మ IPS” వంటి సినిమాల్లో పవర్‌ఫుల్ రోల్స్ చేసింది.

ముమైత్ ఖాన్ “Bigg Boss Telugu Season 1”, అలాగే “Bigg Boss Non-Stop OTT” లోనూ పాల్గొంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంది.

ముమైత్ ఖాన్ చెల్లెలు జాబీనా ఖాన్ కూడా “గొడవ”, “జగడం” వంటి సినిమాల్లో నటించింది. అలాగే, ఆమె తెలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. కానీ ప్రస్తుతం ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *