
సౌత్ సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పారితోషికం పెరుగుతూ వస్తోంది. 2024 నాటికి అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సాయిపల్లవి, రష్మిక, నయనతార, సమంత, త్రిష ముఖ్యంగా నిలిచారు.
రష్మిక మందన్న ప్రస్తుతం “యానిమల్”, “పుష్ప 2”, “ఛావా” వంటి బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతుంది. “సికందర్” చిత్రానికి ₹13 కోట్లు పారితోషికంగా తీసుకుందట. “పుష్ప 2” కోసం ₹10 కోట్లు, “ఛావా”కు ₹4 కోట్లు అందుకుంది.
త్రిష ప్రస్తుతం “విశ్వంభర” సినిమా కోసం ₹12 కోట్లు అందుకుంటుందట. ఆమె కెరీర్ లో ఇప్పటికీ స్ట్రాంగ్ డిమాండ్ కొనసాగుతూనే ఉంది.
నయనతార, లేడీ సూపర్ స్టార్ గా “జవాన్” సినిమా కోసం ₹10 కోట్లు తీసుకుంది. ఆమె వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కు అమ్మి ₹25 కోట్లు సంపాదించిందట.
సమంత, స్పై థ్రిల్లర్ “సిటాడెల్: హనీ బన్నీ” కోసం ₹10 కోట్లు తీసుకుంది, ఇది ఆమె కెరీర్ లో అత్యధిక రెమ్యునరేషన్.
సాయిపల్లవి, రీసెంట్ గా “తండేల్” సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇప్పుడు “రామాయణం” సినిమాలో సీత పాత్రకు ₹20 కోట్లు తీసుకుంటుందట. దీంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది.