Malayalam Hit Poon Man Streams Soon
Malayalam Hit Poon Man Streams Soon

ప్రస్తుతం కంటెంట్ బలంగా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేకపోయినా కథే సినిమాను ముందుకు నడిపిస్తుంది. “పోన్ మ్యాన్” అదే రీతిలో మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ జనవరి 30, 2024న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

ఇప్పుడు ఈ సినిమా మార్చి 14 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. “ఈ బంగారు మనిషి మెరుస్తాడు!” అనే క్యాప్షన్‌తో హాట్ స్టార్ ప్రమోషన్స్ షురూ చేసింది.

కథ విషయానికి వస్తే, పీసీ అజేష్ అనే వ్యక్తి బంగారం తాకట్టు పెట్టి వ్యాపారం చేస్తుంటాడు. కానీ ఓ పెళ్లి కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇస్తే, కేవలం 13 సవర్లే తిరిగి ఇస్తారు. మిగతా 12 సవర్లు రికవర్ చేసుకునే క్రమంలో అతని జీవితంలో వచ్చే ట్విస్ట్‌లే సినిమా హైలైట్.

“జయ జయ జయహే” సినిమాతో టాలీవుడ్‌లో ఫేమస్ అయిన బేసిల్ జోసెఫ్, ఈ మూవీలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడని రివ్యూలు చెబుతున్నాయి. డార్క్ హ్యూమర్, సస్పెన్స్ మిక్స్‌తో తెరకెక్కిన “పోన్ మ్యాన్” హాట్ స్టార్‌లో తప్పక చూడాల్సిన మూవీగా మారనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *