
జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. “అరవింద సమేత” (2018) నుంచి “దేవర” (2024) వరకు ఆరేళ్ల గ్యాప్ వచ్చినా, ఇకపై సినిమాలకు విరామం ఉండకూడదని ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం “వార్ 2” షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై ఓ మాస్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ చిత్రం 2025 మార్చిలో పూర్తవుతుంది.
అప్పటికల్లా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న “డ్రాగన్” షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక “దేవర 2” స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు కొరటాల శివ. మే 2025 నాటికి స్క్రిప్ట్ పూర్తి చేసి, డిసెంబర్ వరకు ప్రీ-ప్రొడక్షన్ జరగనుంది. “డ్రాగన్” షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ “దేవర 2” సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాను 2026 దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు.
అంటే 2026లో ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతికి “డ్రాగన్”, దసరాకు “దేవర 2” వస్తున్నాయి. ఇదే ఫార్ములాతో 2010లో “అదుర్స్” (సంక్రాంతి) & “బృందావనం” (దసరా) వచ్చి హిట్స్ అందుకున్నారు.