
సినిమా ఓపెనింగ్స్, ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార.. ఇప్పుడు మారిపోయారు. తాజాగా మూకూతి అమ్మన్ 2 సినిమా ప్రారంభోత్సవానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.
20 ఏళ్ల క్రితం “చంద్రముఖి” సినిమా ఓపెనింగ్‌కు వచ్చిన నయన్.. ఆ తర్వాత ఏ సినిమా ప్రారంభోత్సవానికీ రాలేదు. కానీ, ఇప్పుడు మూకూతి అమ్మన్ 2 కోసం మళ్లీ దర్శనమిచ్చారు.
2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన “మూకూతి అమ్మన్” సినిమాకు ఇది సీక్వెల్. తొలి షాట్ నయనతారపై చిత్రీకరించారు.
ప్రమోషన్ విషయంలోనూ నయనతార మార్పు కనిపిస్తోంది. గతంలో “శ్రీరామరాజ్యం” తర్వాత ఏ సినిమాకూ ప్రమోషన్ చేయలేదు. కానీ, తన సొంత నిర్మాణం “కనెక్ట్” సినిమాకు మాత్రం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మరోసారి “మూకూతి అమ్మన్ 2” కోసం బయటకు వచ్చారు.
ఇండస్ట్రీలో పెరిగిన పోటీకి తట్టుకునేందుకు నయన్ స్ట్రాటజీ మారుస్తున్నారా? నయనతార ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.