
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొంది జూహీ చావ్లా.. ఇప్పుడు బిజినెస్‌లో భారీగా ఆస్తులు సంపాదించి, ఇండస్ట్రీలో అత్యధిక సంపన్న కథానాయికగా నిలిచింది. ఆమె మొత్తం ఆస్తుల విలువ ₹4600 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి.
తన అందం, అభినయం, మిస్సిండియా కిరీటం సాధించడంతోనే జూహీ బిగ్ స్క్రీన్‌కి వచ్చింది. 1986లో “సుల్తానత్” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో ఆమె నటించిన “విక్కీ దాదా” (నాగార్జునతో) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా జూహీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే జూహీ తండ్రి ఈ సంబంధానికి ఒప్పుకోలేదట. కొన్నాళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన జూహీ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.
తక్కువ కాలంలోనే షారుఖ్ ఖాన్ తరువాత అత్యధిక సంపద కలిగిన నటిగా రికార్డు సృష్టించింది. గత 15 ఏళ్లుగా ఆమె సినిమాల్లో కనిపించకపోయినా, ఆమె ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయి.
ఇప్పుడీ బ్యూటీ వ్యాపారరంగంలో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగాన్ని ఏలిన జూహీ.. బిజినెస్‌లోనూ అదే స్థాయిలో రాణించిందని చెప్పొచ్చు.