Three Roses Season 2 Announcement
Three Roses Season 2 Announcement

“3 రోజెస్” వెబ్ సిరీస్ సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. నవ్వులు పూయించిన తొలి సీజన్ తర్వాత, ఇప్పుడు ఆహా మరోసారి ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమైంది.

మహిళా దినోత్సవం సందర్భంగా “3 రోజెస్” సీజన్ 2 టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో ఈషా రెబ్బా, వైవా హర్ష కామెడీ మరోసారి అదిరిపోయింది. అలాగే ఇద్దరు కొత్త పాత్రలు ఈ సీజన్‌లో చేరబోతున్నారని టీజర్ ద్వారా తెలియజేశారు, కానీ వారు ఎవరో మాత్రం రివీల్ చేయలేదు.

కిరణ్ కారవల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. తొలి సీజన్‌కి మించి మరింత వినోదాన్ని పంచబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఆహా ఓటీటీ త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *