
“జిగ్రా” సినిమాలో అలియా భట్ నటన అద్భుతంగా ఉండటంతో సమంత సహా చాలా మంది ఆమెను ప్రశంసించారు. సమంత అయితే “ఆల్ఫా లేడీ” అంటూ ఆలియాను తెగ పొగిడేశారు. కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
“జిగ్రా” ఫెయిల్యూర్‌పై ఆలియా భట్ స్పందిస్తూ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పింది. దర్శకుడు వాసన్ బాలా ఎంతో కష్టపడి తీసినప్పటికీ, ఫలితం మాత్రం అలా రాలేదని తెలిపింది. కానీ తనకు హిట్లు, ఫ్లాప్స్ పెద్దగా బాధ కలిగించవు అని, సినిమా అంటే తనకు ప్రాణం అని అన్నారు. జయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు సాగడమే తన ధ్యేయం అని తెలిపింది.
ప్రస్తుతం “ఆల్ఫా” అనే కొత్త చిత్రంలో నటిస్తున్న అలియా, పూర్తిగా స్క్రిప్ట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. హిట్ వచ్చినప్పుడు ఎంత ఆనందపడతానో, ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా అంత త్వరగా మర్చిపోతా అని చెప్పిన ఆమె, ప్రతిఒక్కరూ ఇదే మెంచుకోవాలని సూచించింది.
ఇప్పుడు బాలీవుడ్‌లో ఆలియా భట్ తన కెరీర్‌ను కొత్త దిశగా మలచుకుంటున్నట్లు టాక్. అలా అతివేగంగా సినిమాలు చేసి ఫెయిల్యూర్స్ తెచ్చుకోవడం కన్నా, మెరుగైన కథలను ఎంచుకొని సినిమాలు చేయాలని ఆమె స్ట్రాటజీ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అభిమానులు మాత్రం “హాలీవుడ్ రేంజ్‌లో పని చేసే ఈ మేడమ్‌కి మరో సూపర్ హిట్ కచ్చితంగా వస్తుంది” అంటూ ఆమెను పొగుడుతున్నారు!