Wed. Apr 22nd, 2026
OG: ఓజీ విలన్ గ్యాంగ్లో మెరిసిన మోటివేషనల్ స్పీకర్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునేలా సినిమా ఉందని అంటున్నారు.

Also Read:Jatadhara: సోల్ అఫ్ జటాధర భలే ఉందే !

అయితే, ఇదంతా బానే ఉంది కానీ, సినిమాలో అనూహ్యంగా ఒక కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆ నటుడు ఎవరో కాదు, తెలుగులో పలు యూట్యూబ్ ఛానళ్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు. అతని పేరు కశ్యప్. మోటివేషనల్ స్పీకర్‌గా చెప్పుకునే అతను ఒక సైకాలజిస్ట్ కూడా. అతను ఓజీ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో ఒక సభ్యుడిగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో కూడా ఒక సీన్‌లో నటించాడు. మొదటి సినిమాలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకున్నాడు కశ్యప్.