
బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన అందం, అభినయంతో బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు పాన్-ఇండియా స్థాయికి ఎదిగి, ప్రభాస్ కల్కీ 2898 AD (Kalki 2898 AD) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
కల్కీ సినిమా సమయంలోనే దీపికా ప్రెగ్నెంట్ అని అనేక వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అవి నిజమవడంతో, ఇటీవల పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన బిడ్డను చూసుకుంటూ ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే, తల్లి అయినా కానీ దీపికా స్టైల్‌లో, గ్లామర్‌లో ఏమాత్రం తగ్గలేదు.
తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్ (Gold Dress) లో ఫోటోషూట్ చేసి, అద్భుతమైన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీపికా తన సింపుల్ యెట్ ఎలిగెంట్ లుక్ తో అభిమానులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు దీని గురించి వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. “ఎండాకాలంలో ఎడారిలో నీ అల్లరి” అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తుంటే, మరికొందరు “బ్యూటిఫుల్”, “స్టన్నింగ్ లుక్” అంటూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీపికా పదుకొణె ఫ్యాషన్ ఐకాన్ గా మరింత అందర్నీ ఆకర్షిస్తోంది!