
టాలీవుడ్‌లో డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి (Neha Shetty), తన అందంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆకాష్ పూరి నటించిన మెహబూబా (Mehbooba) చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు అసలు గుర్తింపు తెచ్చిన సినిమా డీజే టిల్లు.
ఈ సినిమాతో నేహా శెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీంతో ఆమె కెరీర్ ఓ మోస్తరు దశలోకి వెళ్లింది. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమెకు మరో మంచి అవకాశమొచ్చినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాలో నేహా శెట్టి ఒక ప్రత్యేక పాటలో కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాల్లో గ్యాప్ వచ్చినా, నేహా శెట్టి సోషల్ మీడియాలో (Social Media) మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మళ్లీ టాప్ హీరోయిన్ రేసులో నిలవాలంటే, నేహా శెట్టి కు హిట్ సినిమా కావాల్సిందే. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నట్టు టాక్. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రానుందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.