
టాలీవుడ్ సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మన్మథుడు లో నటించిన అన్షు అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అన్షు, తన అందం, అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ, మన్మథుడు తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో కూడా కనిపించింది. అయితే, ఈ రెండు సినిమాల్లోనూ అన్షు పాత్ర చనిపోవడం ఓ ఆసక్తికర విషయం. ఆ తర్వాత అలాంటి క్యారెక్టర్స్ మాత్రమే రావడంతో, ఆమె సినిమాలకు దూరమైంది.
సినిమాలకు గుడ్‌బై చెప్పిన అనంతరం, లండన్‌కు చెందిన సచిన్ సగ్గార్ ను వివాహం చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం అన్షు లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ బిజినెస్ నిర్వహిస్తోంది. 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అన్షు, ఇటీవలే మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కూతురితో కలిసి సందడి చేయగా, ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అన్షు కూతురిని చూసిన నెటిజన్లు ఆమె అందానికి ముగ్ధులవుతున్నారు. తల్లి లానే కూతురు కూడా చాలా అందంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపించినప్పటికీ, టాలీవుడ్ ప్రేక్షకులకు ఆమెపై ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానంతో ఉంటున్నారు.
మన్మథుడు సినిమా నాగార్జున కెరీర్‌లో ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాకు కథ, సంగీతం, విజువల్స్ తో పాటు అన్షు లాంటి నటీనటులు కూడా స్పెషల్ అని చెప్పాలి. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సినిమా పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుండటమే దీనికి నిదర్శనం.