
ఛార్మీ కౌర్ టాలీవుడ్లో గుర్తింపు పొందిన హీరోయిన్ మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభావవంతమైన నిర్మాత కూడా. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసినా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటింది. మాస్, పౌర్ణమి, లక్ష్మీ, మంత్ర, జ్యోతిలక్ష్మీ వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, టాలీవుడ్లో 25 సినిమాలు చేసినప్పటికీ, కేవలం 5 హిట్స్ మాత్రమే అందుకుంది.
తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఛార్మీ, అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ, నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినీరంగానికి గుడ్‌బై చెప్పి, నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌ను స్థాపించి, వరుస సినిమాలను నిర్మిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 8 సినిమాలు నిర్మించారు. అయితే, అందులో జ్యోతిలక్ష్మీ, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే ఘన విజయాలు సాధించాయి.
సినిమా నిర్మాణంలో బిజీ అయినప్పటికీ, ఛార్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్, కొత్త లుక్స్, సినిమా అప్డేట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూ, నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన న్యూ లుక్ ఫొటోస్ షేర్ చేయగా, నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం, ఛార్మీ పూరి జగన్నాథ్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించింది. టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ, మరోసారి బిగ్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే, ఆమె నుంచి మరిన్ని ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ రావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.